AP: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కలకలం

AP: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కలకలం
X
నిందితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ

అన్న­మ­య్య జి­ల్లా తం­బ­ళ్ల­ప­ల్లె ని­యో­జ­క­వ­ర్గం, మొ­ల­క­ల­చె­రు­వు­లో పె­ద్ద ఎత్తున కల్తీ మద్యం తయా­రు చే­స్తు­న్న ము­ఠా­ను పో­లీ­సు­లు పట్టు­కు­న్నా­రు. ఎక్సై­జ్ అధి­కా­రు­లు, స్థా­నిక పో­లీ­సు­లు ఈ కు­టీర పరి­శ్ర­మ­ను సీజ్ చే­శా­రు. ఈ డం­పు­లో రూ. కో­టి­కి పైగా వి­లు­వైన నకి­లీ మద్యం, తయా­రీ­కి ఉప­యో­గ­ప­డే యం­త్రా­లు, ముడి సరు­కు­లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. ఈ అక్రమ కా­ర్య­క­లా­పా­ల్లో పా­ల్ప­డు­తు­న్న 9 మం­ది­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన జనార్దన్‍రావు, అతని అనుచరుడు రాజు కలిసి ములకలచెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. పలు ప్రభుత్వ మద్యం దుకాణాలు సహా.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ధర కంటే తక్కువకే ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 15 వేల నకిలీ మద్యం సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, 1,500 లీటర్ల బ్లెండ్ , 10 వేల ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు, స్టిక్కర్లు, తయారీ పరికరాలు, ఇతర సామగ్రితోపాటు సరఫరాకు వినియోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.

లిక్కర్ "డైరీ" కలకలం?

నకి­లీ మద్యం తయా­రీ వ్య­వ­హా­రం ఇప్పు­డు ఏపీ­లో కల­క­లం రే­పు­తోం­ది. నకి­లీ మద్యం తయా­రీ కేం­ద్రం­పై దా­డుల సమ­యం­లో ఎక్సై­జ్ అధి­కా­రుల చే­తి­కి డైరీ దొ­రి­కిం­ది. డై­రీ­లో నకి­లీ మద్యం కొ­ను­గో­లు చే­సిన బె­ల్ట్ షా­పుల ని­ర్వా­హ­కుల పే­ర్లు ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. డై­రీ­లో 78 మంది పే­ర్లు ఉన్న­ట్లు గు­ర్తిం­చిన పో­లీ­సు­లు... దర్యా­ప్తు ప్రా­రం­భిం­చా­రు.

మద్యం అక్రమాలకు నిదర్శనం: జగన్

మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టిడిపి నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్‌ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నారని విమర్శించారు.

Tags

Next Story