AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై...లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో గ్రామ, మండల స్థాయిలో సభల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ను ప్రతి జిల్లాకు నోడల్ అధికారిగా నియమించనుంది. భూ అక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డుల్లో మార్పులు లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
చంద్రబాబుపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్
వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. వాహనంపై అభివాదం చేస్తూ చంద్రబాబు వస్తుండగా వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదైనా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
నేడు CRDAపై చంద్రబాబు సమీక్ష
ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. CRDAపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించడంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్ల పురోగతిపై అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. మధ్యాహ్నం మున్సిపల్ శాఖ, రహదారుల మరమ్మతులపై కూడా అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com