AP: స్కిల్ సెన్సెస్ కోసం ప్రత్యేక యాప్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది.స్కిల్ గణన చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... దీన్ని వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం చదువుకున్న వారి వివరాలే కాకుండా అందరిలో ఉన్న స్కిల్‌ను వెలికితీసే దిశగా చర్యలు తీసుకుంటోంది. 15ఏళ్ల నుంచి దాదాపు అరవై ఏళ్ల వరకు వయసున్న వారి స్కిల్స్‌ను గుర్తించేందుకు ఈ గణన ఉపయోగపపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఇష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది ప్రభుత్వం. స్కిల్ గణన కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చి ప్రజల నైపుణ్యాలు, వారు ఇంకా ఏ రంగంలో రాణించాలనే ఆలోచనలో ఉన్నారో తెలుసుకోనుంది. కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి వివరాలే కాకుండా వ్యవసాయం సహా ఇతర చేతి వృత్తుల వారిని కూడా ఈ విభాగంలోకి తీసుకురానుంది. ఇలా చేయడం వల్ల ఏ రంగంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో తెలియనుంది. వారికి ఉన్న ఆసక్తి తెలుసుకొని వారికిని ట్రైనింగ్ ఇవ్వడం అందులో లేటెస్ట్ విధానాలు వివరించగలుగుతామని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ యాప్ ద్వారా ప్రజల వృత్తి నైపుణ్యాలను అంచనా వేయడం ద్వారా వారికి ఉన్న ఆసక్తితోపాటు వారి నైపుణ్యాలు మెరుగుపరిచే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వారి స్థాయిని కూడా వర్గీకరించే వీలు ఉంటుందంటున్నారు. దీనికి అనుగుణంగా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం సులభమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే యాప్‌లో ఎక్కడి నుంచైనా లాగిన్ కావచ్చు. ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ ద్వారా లాగిన్ కావచ్చు. అందులో వ్యక్తిగత వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరి ఏపీకి చెందిన వారైతే చాలు ఈ యాప్‌లో తమ వివరాలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకో విధానంలో కూడా వివరాలు ఇందులో పొందుపరిస్తారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఒక్కొక్కరు ఇరవై మంది వివరాలును సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ స్కిల్ సెన్సెస్ తర్వాత మరో అడుగు ముందుకు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్‌నకు పరిశ్రమలను అటాచ్ చేయనుంది. అంటే తమ రాష్ట్రంలో ఈఈ నైపుణ్యాలు కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారని వారికి తెలియజేసి వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేలా చేయడం రెండో లక్ష్యం. అటుప్రజలకు ఇటు పరిశ్రమలకు మధ్య గ్యాప్‌ను తగ్గించి నిరుద్యోగతను తగ్గించాలని భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com