AP Government : ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

AP Government : ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. వన్ టైం సెటిల్మెంట్ తరహాలోనే OTC విధానాన్ని తీసుకువచ్చింది వైసీపీ సర్కార్. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిపై భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లోని నిర్మాణాలకు నాలా వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్న దానికి నాలా వసూలుతో పాటు పెనాల్టీ కట్టి క్రమబద్దీకరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర భూముల్లో ఉన్న నిర్మాణాల డేటా సేకరించారు అధికారులు. ఈ డేటా ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత గడువులోగా క్రమబద్దీకరించుకోకపోతే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ భూముల్లో నిర్మాణం ఎప్పుడు కట్టినా ఓటీసీ వర్తిస్తుంది.
పురాతన కట్టడాలకు సైతం మినహాయింపు లేదంటున్నారు అధికారులు. ఈ ఓటీసీ వసూలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వం ప్రకారం భూమి విలువలో 5 శాతం నాలా వసూలు, 5 శాతం పెనాల్టీగా నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com