MLA Muralimohan : వైసీపీ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదు : ఎమ్మెల్యే మురళీమోహన్

ఐదేళ్ళ వైసీపి పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ కు రాలేదని, దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించడంలో వైసీపి విఫలమైందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ విమర్శించారు. సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకర్ల సమావేశంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ తీవ్ర స్ధాయిలో వైసీపిపై మండిపడ్డారు. గత ఐదేళ్ళ కాలంలో వైసీపి ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ, స్వలాభం కోసం పని చేసిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రం జరుగుతున్న అరాచక పాలనపై, ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యలపై గళం విప్పుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్రను చేపట్టారని చెప్పారు. వైసీపి దౌర్జన్య పాలనను పాతాళానికి తొక్కెస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమంను అందిస్తూ, ఆర్ధిక స్ధితిగతుల్లో మార్పులు తీసుకొచ్చిందన్నారు. కుప్పంలో యువగళం పేరుతో నారా లోకేష్ యువగళం పాదయాత్రను మొదలు పెట్టి 3132 కిలోమీటర్ల పాటు 11 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. ఈ యాత్రలో ఎదురైన అవరోధాలను అధిగమించి, ప్రజల మద్దతు సాధించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ పాదయాత్రను ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, నారా లోకేష్ బాబు తమ లక్ష్యాన్ని సాధించారని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో కనీసం ఒక్క పరిశ్రమ ఐనా రాష్ట్రానికి రాలేదని, ఉన్న కంపెనీలు కూడా భయంతో బయటకు వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. దావోస్‌లో పెట్టుబడులను ఆకర్షించడంలో వైసీపీ విఫలమైందని, దావోస్ నే వైజాక్ కు తెప్పిస్తామని ఆర్భాటంగా చెప్పిన వైసీపి వెయిటర్స్ కు సూట్స్ వేసి కూర్చోబెట్టిందన్నారు. వైజాగ్‌లో జరిగిన సమ్మెట్ కేవలం హాస్యాస్పదంగా మారిందని ఆయన అన్నారు.
నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో దావోస్ లో నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు, మరో వైపు నారా లోకేష్ లు చర్చలు జరిపి వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. దీంతో విజన్ 2047కి రాష్ట్రాన్ని ఏవిధంగా ఆర్ధికంగా, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయాలో అనేందుకు దావీస్ జరిగిన ప్రపంచ వాణిజ్య వ్యాపార వేత్తల సదస్సు నిదర్శమని తెలిపారు. టిడిపి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి పేదవాడి ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే విమర్శలను పట్టించుకోవద్దని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మరియు జిల్లా నాయకులు పాల్గోన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com