AP Unemployment: ఏపీలో నిరుద్యోగుల దుస్థితి.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని సీఎంపై ఫైర్..

AP Unemployment: ఏపీలో నిరుద్యోగుల దుస్థితి.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని సీఎంపై ఫైర్..
AP Unemployment: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఎప్పుడోస్తాయే తెలియక నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

AP Unemployment: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఎప్పుడోస్తాయే తెలియక నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. గ్రూప్-1, గ్రూప్‌-2, పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జగన్.. రెండున్నరేళ్లు గడిచిన నిరుద్యోగ యువత సమస్యలు పట్టించుకోలేదు. దీంతో ప్రతి ఏడాది జనవరి నెలలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీస్తున్నారు నిరుద్యోగులు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి నోటిషికేషన్లు వెంటనే జారీ చేయాలని ఏఐఎన్ఎఫ్, ఏఐవైఎఫ్, తెలుగునాడు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను అధికారంలోకి రాగానే ఆ పోస్టులను భర్తీ చేస్తానన్న హామీ ఏమైందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా.. ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. దీంతో ఖాళీ అయ్యే పోస్టుల సంఖ్య తగ్గుతుందంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతేడాది జూన్ 18న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా విడుదలైన జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తం 10 వేల 143 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది మార్చి నాటికి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది.

ఇందులో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగాలు 6 వేల 143 కాగా భర్తీ చేస్తుండగా..12 వందల 38 బ్యాక్‌లాగ్ పోస్టులను ఏపీ పీఎస్సీ సహా ఇతర శాఖల ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగిలిన రెండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. మరో 36 ఉద్యోగాల ప్రకటనకు మార్చి నెలాఖరుతో గడువు ముగుస్తుంది.

జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్‌-1, గ్రూప్‌-2 కింద 36 పోస్టులు భర్తీ చేస్తున్నట్ల ప్రభుత్వం ప్రకటించింది. ఈ 36 ఉద్యోగాల భర్తీకి ఆగష్టులోనే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. గ్రూప్‌-1,గ్రూప్‌-2 కింద చూపించిన పోస్టుల సంఖ్య తక్కువగా ఉందంటూ నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. పోలీసు, ఇతర ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జాడే లేదు. దీంతో చాలా మంది వయోపరిమితితో ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు.

రాష్ట్రంలో చివరిసారిగా 2018 డిసెంబర్‌లో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. అప్పట్లోనే 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు చేపట్టిన ఉద్యమంతో కలెక్టరేట్లు దద్దరిల్లాయి. ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ చేయాలంటూ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

చాలా చోట్ల నిరసనల్లో పాల్గొనకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందు రాత్రే పలువురు విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో జగదాంబ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌కు వెళ్తున్న నిరుద్యోగులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లాలో జరిగిన ఛలో కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు నిరుద్యోగులు, విద్యార్ధుల సంఘాలు.

అయితే, కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నిరుద్యోగులు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, నిరుద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతపురం కలెక్టర్‌ ఆఫీసు దగ్గర నిరుద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. కలెక్టరేట్‌కు రాకుండా ఉండేందుకు పోలీసులు అన్ని దారులను మూసేశారు.

అయినా సరే నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నేతలు కలెక్టరేట్‌కు చొచ్చుకొచ్చారు. మాట తప్పను, మడమ తిప్పనన్న జగన్.. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అటు మిగతా జిల్లాల్లోనూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆందోళనలు చేశారు నిరుద్యోగులు. విజయనగరం జిల్లా కోట జంక్షన్ నుంచి కలెక్టరేట్‌ వరకు వందలాది మంది విద్యార్ధులు ర్యాలీ చేపట్టారు. కొందరు విద్యార్ధులపై పోలీసులు దాడి చేశారు.

పోలీసుల చర్య పట్ల విద్యార్ధినులు కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్‌కు వెళ్తున్న నిరుద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో టీడీపీ విద్యార్ధి సంఘాలు నిరసన చేపట్టాయి. ఛలో కలెక్టరేట్‌కు నిరుద్యోగులు పిలుపునివ్వడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆందోళనలో పాల్గొనొద్దంటూ విద్యార్ధి సంఘాలు, టీడీపీ విద్యార్ధి సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story