టీడీపీ మద్దతుదారుడు ఇంటికి వచ్చి నామినేషన్ ఉపసంహరించుకోవాలని వార్నింగ్

X
పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారపక్షం నాయకుల రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఇంటికొచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని 6వ వార్డు మెంబర్‌గా టీడీపీ మద్దతుతో పోటీచేస్తున్న గోళ్ల శ్రీనివాసరావు ఇంటికిచ్చిన అధికారపక్షం నాయకులు.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు.
హోంమంత్రి తమ కజిన్ అని, కలెక్టర్ పోస్టూ కూడా నేనే ఇప్పించానంటూ బలవంతంగా నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరుచెప్పి బెదిరింపులకు గురిచేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
