AP: టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటా

AP: టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటా
X
అది అనుకోకుండా జరిగిన ఘటన.. చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన ఏపీ మంత్రి

ఏలూరు జిల్లా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేశ్ తో కలిసి టీడీపీ మంత్రి, ఎమ్మెల్యే పాల్గొనడం కలకలం రేపుతోంది. లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రమేశ్ పాల్గొనడంపై TDP ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి పార్థసారధి, పలాస MLA గౌతు శిరీష వివరణ ఇవ్వాలని లోకేశ్ ఇప్పటికే ఆదేశించారు. TDP నేతల మధ్య జోగి రమేష్ ఈ విధంగా మంటపెట్టారనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులపై దుమ్మెత్తిపోస్తూ పార్టీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తున్నారు.

స్పందించిన కొలుసు

నూజివీడు ఘటనపై పార్టీ అగ్రనాయకత్వం కొంత ఆలస్యంగానైనా పార్థసారథి, గౌతు శిరీష స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తనను అక్కున చేర్చుకున్నారని.. తనకు సముచిత స్థానమిచ్చిన టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి పార్థసారథి చెప్పారు. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందర్నీ పిలిచారని, వైసీపీ నేత జోగి రమేష్‌ కూడా వచ్చారని, అది అనుకోకుండా జరిగిన ఘటనని వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెబుతున్నానన్నారు.

ఎవరెవరొస్తున్నారో తెలియకే జోగి రమేష్‌ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్నానని గౌతు శిరీష తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానంటూ ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఈ వివరణలతో టీడీపీ శ్రేణులు మరింత అసంతృప్తికి గురయ్యాయి. కార్యక్రమం ఎందుకు జరుగుతుందో, ఎవరు వస్తున్నారో తెలియకుండా వెళ్లడానికి వారేమైనా చిన్నపిల్లలా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story