LOKESH: నేడు నారా లోకేశ్ భారీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆసక్తి కలిగించే ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంగళవారం టాటా సన్స్, టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నటరాజన్‌తో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. ఇవాళ భారీ ప్రకటన చేస్తానని నారా లోకేశ్ ప్రకటించారు. అప్పటివరకు అందరూ ఎదురుచూడాలని కోరారు. దీంతో నారా లోకేష్ ట్వీట్‌పై రాజకీయ విశ్లేషకులు చర్చోపచర్చలు చేస్తున్నారు. కాగా, యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అంతకుముందు లోకేష్ అన్నారు. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని నారా లోకేష్ వెల్లడించారు.
మాట నిలబెట్టుకున్నా: మంత్రి లోకేష్
పాదయాత్రలో తాను ఇచ్చిన మాట నెరవేరుస్తున్నానని మంత్రి లోకేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు నా దృష్టికి తెచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప, నైవేద్య సాయం రూ.10 వేలకు పెంచాం. ప్రస్తుతం 5,400 చిన్న ఆలయాల్లో భగవంతుడి సేవకు ఆటంకం లేకుండా చేశాం.’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
లోకేష్‌ను కలిసిన ఆలూరు శివప్రసాద్
ఆలూరు కు చెందిన వైకుంఠ శివప్రసాద్ నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆలూరులో ఉన్న సమస్యలపై నారా లోకేష్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్ పలు విషయాలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సూచించారు. ఆలూరు లో ఉన్న తాగునీటి సమస్య అనేక సమస్యలను వెంటనే చేయాలని నారా లోకేష్‌కు తెలిపారు.
రాజస్థాన్ సీఎంకి చంద్రబాబు ఫోన్
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్న బస్సు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన గురించి భజన్ లాల్‌తో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాద బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. వారంతా తిరిగి ఇంటికి రావడానికి సహాయ సహకారాలు అందించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com