మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ అరికట్టేందుకు SEC ప్రత్యేక దృష్టి

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ అరికట్టేందుకు SEC ప్రత్యేక దృష్టి
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీని అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీని అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లలో డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశాలు ఉన్నట్టు గుర్తించామని SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఆదాయ పన్ను శాఖను అప్రమత్తం చేశామన్నారు. ఎంసీసీ బృందాలు డబ్బు ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టాయని నిమ్మగడ్డ తెలిపారు. అలాగే మద్యం పంపిణీపై కూడా దృష్టి సారించామని.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని SEC నిమ్మగడ్డ రమేష్ హెచ్చరించారు.


Tags

Next Story