AP Cabinet: ఏపీలో కొత్త మంత్రులు.. ఎవరెవరికి ఏ శాఖ అంటే..?

AP Cabinet: జగన్ తన కబినెట్ లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారు. డిప్యూటీ సీఎంగా మైనార్టీ సామాజిక వర్గం నుంచి అంజాద్ బాషా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి పి.రాజన్నదొర, బీసీ సామాజిక వర్గం నుంచి బూడి ముత్యాలనాయుడు, కాపు సామాజిక వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి నారాయణస్వామి డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు.
ఇక బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక, మత్స్యశాఖ, గుడివాడ అమర్‌నాథ్‌కు పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కేటాయించారు. బూడి ముత్యాలనాయుడుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, దాడిశెట్టి రాజాకు రోడ్లు, భవనాల శాఖ, పినిపే విశ్వరూప్‌కు రవాణా శాఖ కేటాయించారు. చెల్లుబోయిన వేణుకు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్, తానేటి వనితకు అత్యంత కలకమైన హోంశాఖ కేటాయించారు. కొట్టు సత్యనారాయణకు దేవాదాయ శాఖ, జోగి రమేష్‌కు గృహ నిర్మాణ శాఖ, విడదల రజినీకి వైద్య ఆరోగ్య శాఖ, చఅంబటి రాంబాబుకు జలవనరుల శాఖ కేటాయించారు.
అటు.. ఆదిమూలపు సురేష్‌కు మున్సిపల్ శాఖ, కాకాని గోవర్ధన్‌రెడ్డికి వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ ఇచ్చారు. ఆర్కే రోజాకు టూరిజం, సాంస్కృతిక యువజన శాఖ, నారాయణస్వామికి ఎక్సైజ్ శాఖ, అంజాద్ బాషాకు మైనార్టీ సంక్షేమ శాఖ, బుగ్గన రాజేంద్రనాథ్‌కు ఆర్థిక శాఖ, గుమ్మనూరు జయరాంకు కార్మిక శాఖ, ఉషాశ్రీచరణ్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ, ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ శాఖ కేటాయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com