AP PAC Chairman : జనసేనకు ఏపీ పీఏసీ చైర్మన్ పదవి
ఏపీ పీఏసీ చైర్మన్‌పై ఉత్కంఠకు తెరపడింది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఆ అవకాశం జనసేనకు దక్కింది. జనసేనకు పీఏసీ చైర్మన్ పదవిని టీడీపీ కేటాయించింది. దాంతో భీమవరం ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి ఆంజనేయులును పేరును పవన్ కల్యాణ్ సూచించారు. వైసీపీ నుంచి పీఏసీగా నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ తగిలింది. వాస్తవంగా పీఏసీ పదవి ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ. అయితే, ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కలేదు. సభలో కనీసం 18 మంది ఉంటేనే ఈ హోదా దక్కుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న మిత్రపక్షం జనసేనకు ఈ అవకాశం దక్కింది. రేపు పీఏసీ సభ్యుల ఎన్నిక జరగనుంది. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉండనున్నారు. కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అన్ని స్థానాలకు కూటమి సభ్యులు నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి, ముగ్గురు MLCలు నామినేషన్ వేశారు. కౌన్సిల్‌లో వైసీపీకి బలం ఉండడంతో.. కౌన్సిల్ నుంచి పీఏసీలో సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశముంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com