టీడీపీకి కంచుకోటగా ఉన్న చోట ఘర్షణకు దిగిన వైసీపీ ఏజెంట్లు

టీడీపీకి కంచుకోటగా ఉన్న చోట ఘర్షణకు దిగిన వైసీపీ ఏజెంట్లు
ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేసేందుకే తమపై దాడులకు దిగుతున్నారని.. టీడీపీ వర్గీయులు అంటున్నారు.

విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కొమరాడ మండలం విక్రమపురంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణతో పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న విక్రమపురంలో వైసీపీ ఏజెంట్లు తగాదాకు దిగారు. ఒక వృద్ధురాలి ఓటు విషయంలో వైసీపీ వర్గీలుయులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేసేందుకే తమపై దాడులకు దిగుతున్నారని.. టీడీపీ వర్గీయులు అంటున్నారు.


Tags

Next Story