పంచాయతీ ఎన్నికల్లో ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్‌కు బిగ్ షాక్!

పంచాయతీ ఎన్నికల్లో ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్ సొంత గ్రామం కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లిలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అధికారపార్టీ ఎంపి శ్రీధర్ కుటుంబ సభ్యుడు,వైసీపీ మద్దతుదారుడైన కొటగిరి గాంధి ఓటమి పాలయ్యాడు.
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్ధి,ఎంపి శ్రీధర్ సొంత అక్క అనిత 520 ఓట్ల మెజార్టీతో గెలవడం చర్చనీయ అంశంగా మారింది. మొత్తం10 వార్డులలో 9 వార్డులు అనిత ప్యానల్‌లోని
స్వతంత్ర అభ్యర్ధులు కైవశం చేసుకోవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. సాక్షాత్తు ఎంపీ శ్రీధర్ కుటుంబం నుంచి ఇద్దరు.. సర్పంచ్ అభ్యర్ధులుగా బరిలో దిగడం..అయితే.. ఎంపి మద్దతు తెలిపిన అభ్యర్ధులు కాకుండా.. ఎంపీ మద్దతు లేని అతని అక్క అనిత ఘన విజయం సాధించడం వైసీపీ వర్గాలకు మింగుడు పడడం లేదు.
మొత్తం 10 వార్డులలో కేవలం ఒక్క వార్డులో మాత్రమే 6 ఓట్ల తేడాతో అనిత ప్యానల్ అభ్యర్ధి ఓటమిపాలు కావడంపై వైసీపీ శ్రేణుల్లో రసవత్తర చర్చ జరుగుతోంది. మూడో విడత పంచాయితీ ఎన్నికల్లో చితంతలపూడి నియోజకవర్గంలో కూడ దాదాపు ఇదే విధంగా రెబల్స్ పోరుతో త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో.. అక్కడ కూడ రసవత్తర రాజకీయాలు నడిచాయి. ఓ వైపు.. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దతుదారులు..మరోవైపు సిట్టింగ్ ఎంపీ మద్దతుదారులు బరిలో దిగడంతో ప్రత్యర్ధులకు అది వరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com