SHARMILA: జగన్.. రాజీనామా చెయ్

ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ అధినేత, మాజీసీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోతే వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా, వైసీపీ ఎమ్మెల్యేలు అయినా తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు మీకు పదవులు ఎందుకు
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ప్రభుత్వానికి కౌంటర్‌గా.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ చెప్పారు. అయితే వైఎస్ జగన్ నిర్ణయాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుబట్టారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేనివారికి పదవులు ఎందుకు అని నిలదీశారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కరెక్ట్ సరైన నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. ప్రజల తరఫున నిలబడలేనప్పుడు అలాంటి పదవి ఆయనకు అవసరం లేదని...వెంటనే రాజీనామా చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
షర్మిల టార్గెట్ జగనే..
కొన్ని రోజులుగా షర్మిల తన అన్న జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. షర్మిల మరోసారి జగన్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తోందో అప్పుడు ఆమె కూడా మీడియా ముందుకు వస్తుంది. తాజాగా సోషల్ మీడియా పోస్టులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలా YCP వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో షర్మిల కూడా ఈ ఫేక్ పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇలా మరోసారి జగన్‌ను ఆమె టార్గెట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సమాజానికి మంచి చేసే సోషల్ మీడియాను.. కొందరు సైకోలు, సైకో పార్టీలతో కలిసి భ్రష్టు పట్టించారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై ఆమెకు ట్విట్టర్ లో స్పందించారు. తనపై, తల్లి విజయమ్మ, సునీతపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని కూడా అవమానించారని... దారుణమైన పోస్టులు పెట్టే వారు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com