AP: వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసుల వేట

AP: వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసుల వేట
X
ప్రత్యేక బృందాలు ఏర్పాటు... రవీంద్రారెడ్డి కోసం నాలుగు పోలీస్ బృందాలు

అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టుల పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం కడపతోపాటు అనంతపురం జిల్లాల్లో ఆయన కోసం వెతుకులాట మొదలుపెట్టారు పోలీసులు. ప్రస్తుతం వర్రా రాష్ట్రం దాటిపోయాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. రవీంద్రారెడ్డి కోసం నాలుగు పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆయన కోసం అనంతపురం, కడప జిల్లాల్లో రెండు టీమ్‌లు సెర్చింగ్ మొదలుపెట్టారు. మరో టీమ్ బెంగుళూరు వెళ్లింది. నాలుగో టీమ్ మాత్రం వర్రా పట్టుబడిన నుంచి తప్పించుకునే జరిగిన కాల్ డేటా సేకరించే పనిలో నిమగ్నమైందని సమాచారం. ఈనెల ఐదున రాజంపేట పోలీసులు వర్రాపై కేసు నమోదు చేశారు. దీనిపై కడపలో మరో కేసు నమోదు అయ్యింది. కడప ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చారు. అదే సమయంలో రాజంపేట నుంచి మరో టీమ్ కడపకు వచ్చింది. ఈలోగా మారువేషంలో వర్రా రవీంద్రారెడ్డి అక్కడి నుంచి తప్పించుకున్నాడు . అయితే వర్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కొందరు వైసీపీ మద్దతుదారు పోలీసులు జిల్లా నేతలకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ పరారీ

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రవీందర్‌ రెడ్డి తప్పించుకున్న సమయంలో ఆయనతో రాఘవరెడ్డి చాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ, ఆయన లేకపోవడంతో పోలీసులు నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు.

దారికొస్తున్నట్లేనా..?

కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో నీచ వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వైసీపీ యాక్టవిస్టులు దారికి వస్తున్నట్లు టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. పవన్‌ ఆక్రోశం... చంద్రబాబు ఆగ్రహంతో సోషల్‌ సైకోలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారు పెట్టిన పోస్టులకు అరెస్టులూ చేస్తున్నారు. పోలీసుల వరుస చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సోషల్‌ సైకోలు పలువురు ఏపీని విడిచి పారిపోతున్నారు.ఇక తప్పు చేయమని వఇలాంటి తప్పులు చెయ్యం. వదిలిపెట్టండి అని పోలీసులను వేడుకుంటున్నారు. ఇంకొందరు భయంతో న్యాయవాదుల్ని వెంట బెట్టుకుని ఠాణాలకు వచ్చి రక్షణ కోరుతున్నారు.

Tags

Next Story