మైదుకూరు ఛైర్మన్ పీఠం టీడీపీదా..? వైసీపీదా..? నరాలు తెగే ఉత్కంఠ!

X
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతలు తలెత్తకుండా పట్టణంలో 144 సెక్షన్ విధించారు..600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఛైర్మన్ పదవి కోసం వైసీపీ, టీడీపీ పోటాపోటీ వ్యూహాలతో ఉత్కంఠ కొనసాగుతోంది.మైదుకూరులో 24 వార్డులు ఉండగా వైసీపీ- 11, టీడీపీ- 12, జనసేన- 1 చొప్పున గెలిచాయి.తమ పార్టీ కౌన్సిలర్లు చేజారిపోకుండా ఎవరికి వారు క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లు 2 వైసీపీకే ఉండటంతో వైసీపీ బలం 13కి చేరింది. అటు జనసేన మద్దతుతో టీడీపీ బలం కూడా 13కి చేరింది.. దీంతో ఏ పార్టీ నేత ఛైర్మన్ అవుతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
