National Parade : గణతంత్ర పరేడ్‌లో ఏపీ శకటం

National Parade : గణతంత్ర పరేడ్‌లో ఏపీ శకటం
X

ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే 76వ రిపబ్లిక్ డే పరేడ్‌లో 26 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఉన్నాయి. దక్షిణాది నుంచి ఏపీ ,కర్ణాటకలకు అవకాశం దక్కగా, తెలంగాణకు దక్కలేదు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న AKP(D) ఏటికొప్పాక బొమ్మల శకటానికి స్థానం దక్కింది. అంకుడు కర్రతో చేతితో తయారు చేసే ఈ బొమ్మలకు 2017లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.

కర్ణాటక (లక్కుండి: రాతి చేతిపనుల ఊయల), గోవా (గోవా సాంస్కృతిక వారసత్వం), ఉత్తరాఖండ్ (ఉత్తరాఖండ్: సాంస్కృతిక వారసత్వం, సాహస క్రీడలు), హర్యానా ( భగవద్గీతను ప్రదర్శిస్తోంది), జార్ఖండ్ (స్వర్ణిమ్ జార్ఖండ్: ఎ లెగసీ ఆఫ్ హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్), గుజరాత్ (స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్), పంజాబ్ (పంజాబ్ జ్ఞాన భూమి), ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్ 2025 - స్వర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్), బీహార్ (స్వ‌ర్ణిం భారత్: విరాసత్ ఔర్ వికాస్ -నలంద విశ్వవిద్యాలయం), మధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్ కీర్తి: కునో నేషనల్ పార్క్- ది ల్యాండ్ చీతలు), త్రిపుర (శాశ్వత భక్తి: త్రిపురలో 14 దేవతల ఆరాధన - ఖర్చీ పూజ), పశ్చిమ బెంగాల్ ('లక్ష్మీ భండార్' & 'లోక్ ప్రసార్ ప్రకల్ప' - బెంగాల్‌లో జీవితాలను శక్తివంతం చేయడం, స్వావలంబనను పెంపొందించడం), చండీగఢ్ (చండీగఢ్: వారసత్వం, ఆవిష్కరణ, స్థిరత్వం, సామరస్య సమ్మేళనం), ఢిల్లీ (నాణ్యమైన విద్య), దాద్రా నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ (కుక్రి స్మారక చిహ్నంతో పాటు డామన్ ఏవియరీ బర్డ్ పార్క్ - భారత నావికాదళంలోని పరాక్రమ నావికులకు నివాళి) శ‌క‌టాలు ప్ర‌ద‌ర్శిస్తారు.

Tags

Next Story