టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా..!

X
తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా పార్టీ అధినాయకత్వంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాహాటంగానే విమర్శలు చేశారు. పార్టీ పెట్టినప్పడి నుంచి టీడీపీలోనే ఉన్న బుచ్చయ్య.. ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాజమండ్రిలోని తన నివాసంలోనే ఉన్న బుచ్చయ్య మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
