టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ

టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ
X
Chandrababu: అమరావతిలో తెలుగుదేశం సీనియర్ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.

Chandrababu: అమరావతిలో తెలుగుదేశం సీనియర్ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ దౌర్జన్యాలు...టీడీపీ నేతల అక్రమ అరెస్టుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో మైనింగ్‌కు అడ్డూఅదుపులేకుండా పోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియా భయబ్రాంతులకు గురి చేస్తోందని సమావేశంలో నేతలు ఆరోపించారు. జగన్ అండ్ కో అవినీతి, దుబారాలతోనే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయినట్లు తెలిపిన టీడీపీ సీనియర్ నేతలు..రాష్ట్రం ఆర్థిక సంక్షోభవం దిశగా పయనిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఎక్కడ తట్టి మట్టి పోయకున్నా...రోడ్డు సెస్ పేరుతో రూ.1200 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపించారు. దారిమళ్లించిన నిధులను తిరిగి... రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని సమావేశంలో డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ వ్యవహారం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించిన నేతలు...సమస్యను పక్కదారి పట్టించేందుకు కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. రెండేళ్లయినా...ఉపాధి బిల్లులను చెల్లించకపోవటం....కోర్టు దిక్కరణ కిందకు వస్తుందని...నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. వైసీపీ రెండేళ్లపాలనలో దళితులపై దాడులు పెరిగాయన్న నేతలు...హోంమంత్రిని డమ్మీ చేశారని విమర్శించారు. ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల సంఖ్యను వైసీపీ సర్కార్‌... క్రమంగా తగ్గిస్తోందని ఆరోపిస్తూ...సామాజిక వర్గాలను జగన్ సర్కార్ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

APSDC ద్వారా అప్పులు తీసుకవచ్చి ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని సమావేశంలో నేతలు విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టరాజ్యంగా చేస్తున్న అప్పులపై.. కేంద్రం లేఖ రాయటం...వైసీపీ ప్రభుత్వ తీరును తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలో జీతాల కోసం డిమాండ్ చేసిన మున్సిపల్ ఉద్యోగులను అరెస్టు చేసే దుస్థితిని వైసీపీ ప్రభుత్వం సృష్టించిందని మండిపడ్డారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. సునీతారెడ్డి ఇచ్చిన జాబితాలో ఉన్నవారిని ఇంకా ఎందుకు విచారించటంలేదని ప్రశ్నించారు నేతలు. సీఎం జగన్ పరిపాలనపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెరుగుతుందని సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్రంలో రోజురోజురు పెరుగుతున్న డీజీల్, పెట్రోల్ ధరలపై.... ఈనెల 7న నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది.

Tags

Next Story