AP: ఏపీలో ఆర్టీఐ పరిధిలోకి ఆలయాలు, మసీదులు, చర్చిలు

AP: ఏపీలో ఆర్టీఐ పరిధిలోకి ఆలయాలు, మసీదులు, చర్చిలు
X
సమా­చార పా­ర­ద­ర్శ­కత అం­శం­పై కీ­ల­క­మైన స్ప­ష్టత

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో దే­వా­ల­యా­లు, మసీ­దు­లు, చర్చి­ల­కు సం­బం­ధిం­చిన సమా­చార పా­ర­ద­ర్శ­కత అం­శం­పై కీ­ల­క­మైన స్ప­ష్టత వె­లు­వ­డిం­ది. ప్ర­భు­త్వ సహ­కా­రం లేదా ప్ర­భు­త్వ పర్య­వే­క్ష­ణ­లో నడి­చే మత సం­స్థ­లు సమా­చార హక్కు చట్టం పరి­ధి­లో­కి వస్తా­యా లేదా అన్న చర్చ చా­లా­కా­లం­గా కొ­న­సా­గు­తు­న్న నే­ప­థ్యం­లో రా­ష్ట్ర ప్ర­ధాన సమా­చార కమి­ష­న్ తా­జా­గా దీ­ని­పై స్ప­ష్ట­మైన అభి­ప్రా­యా­న్ని వె­ల్ల­డిం­చిం­ది. ప్ర­భు­త్వ ని­ధు­లు, గౌరవ వే­త­నా­లు లేదా ప్ర­భు­త్వ వ్య­వ­స్థల ఆధ్వ­ర్యం­లో ని­ర్వ­హణ పొం­దు­తు­న్న మత సం­స్థ­లు ప్ర­జ­ల­కు జవా­బు­దా­రీ­త­నం కలి­గి ఉం­డా­ల­ని, అలాం­టి సం­స్థ­లు సమా­చార హక్కు చట్టం కింద సమా­చా­రా­న్ని అం­దిం­చా­ల్సిన బా­ధ్యత కలి­గి ఉం­టా­య­ని పే­ర్కొ­న­డం ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది. రా­ష్ట్ర ప్ర­ధాన సమా­చార కమి­ష­న­ర్ (సీ­ఐ­సీ) వజ్జా శ్రీ­ని­వా­స­రా­వు మా­ట్లా­డు­తూ ప్ర­భు­త్వ ఆర్థిక సహ­కా­రం­తో ని­ర్వ­హిం­చ­బ­డు­తు­న్న ఆల­యా­లు, మసీ­దు­లు, చర్చి­లు సమా­చార హక్కు చట్టం-2005 పరి­ధి­లో­కి వస్తా­య­ని స్ప­ష్టం చే­శా­రు. ఈ సం­స్థల నుం­చి ఎవ­రై­నా పౌ­రు­లు సమా­చా­రం కో­రి­తే సం­బం­ధిత అధి­కా­రు­లు తప్ప­ని­స­రి­గా సమా­ధా­నం ఇవ్వా­ల్సిం­దే­న­ని తే­ల్చి­చె­ప్పా­రు. ప్ర­జల డబ్బు లేదా ప్ర­భు­త్వ సహ­కా­రం అం­దు­తు­న్న సం­స్థ­లు ప్ర­జ­ల­కు జవా­బు­దా­రు­లు­గా ఉం­డా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు.

మినహాయింపులు ఇచ్చిన కమిషన్

అయి­తే ఈ ని­ర్ణ­యం­లో కొ­న్ని అం­శా­ల­కు మి­న­హా­యిం­పు­లు కూడా ఉన్నా­య­ని కమి­ష­న్ స్ప­ష్టత ఇచ్చిం­ది. మత వి­శ్వా­సా­లు, వ్య­క్తి­గత ఆచా­రా­లు, ప్ర­త్యేక పూజా వి­ధా­నా­లు, మత­ప­ర­మైన వే­డు­క­లు వంటి అం­త­ర్గత మత సం­బం­ధిత అం­శా­లు మా­త్రం సమా­చార హక్కు చట్టం పరి­ధి­లో­కి రా­వ­ని పే­ర్కొం­ది. అంటే పరి­పా­లన, ని­ర్వ­హణ, ఆర్థిక వ్య­వ­హా­రా­లు వంటి అం­శా­ల­పై సమా­చా­రం కో­ర­వ­చ్చు­గా­నీ, వ్య­క్తి­గత వి­శ్వా­సా­ల­కు సం­బం­ధిం­చిన అం­శా­ల­పై ఆర్టీఐ వర్తిం­చ­ద­ని వి­వ­రిం­చిం­ది. వన ఈ ని­ర్ణ­యా­ని­కి కా­ర­ణ­మైన కేసు కూడా ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. వి­శా­ఖ­ప­ట్నం­లో­ని శ్రీ కనక మహా­ల­క్ష్మి అమ్మ­వా­రి ఆల­యా­ని­కి సం­బం­ధిం­చిన కొ­న్ని వి­వ­రా­ల­ను పట్నా­య­క్ అనే వ్య­క్తి 2013లో సమా­చార హక్కు చట్టం కింద కో­రా­రు. ఆల­యం­లో జరి­గే పం­డు­గ­లు, వాటి ని­ర్వ­హణ, ఇతర పరి­పా­లన అం­శా­ల­కు సం­బం­ధిం­చిన సమా­చా­రం కా­వా­ల­ని ఆయన అభ్య­ర్థిం­చా­రు. ఈ క్ర­మం­లో ఆర్టీఐ చట్టం ప్ర­కా­రం మొ­త్తం 21 దర­ఖా­స్తు­లు సమ­ర్పిం­చి­న­ట్లు ఆయన తె­లి­పా­రు. తాను కో­రిన సమా­చా­రం ఇవ్వ­కుం­డా ఆలయ పబ్లి­క్ ఇన్ఫ­ర్మే­ష­న్ ఆఫీ­స­ర్ (పీ­ఐ­వో) తన దర­ఖా­స్తు­ల­ను తి­ర­స్క­రిం­చా­ర­ని పట్నా­య­క్ ఆరో­పిం­చా­రు. తన అభ్య­ర్థ­న­ల­ను ఎం­దు­కు తి­ర­స్క­రిం­చా­ర­నే వి­ష­యా­న్ని కూడా స్ప­ష్టం­గా తె­లి­య­జే­య­లే­ద­ని, ఆర్టీఐ చట్టం­లో­ని ఏ ని­బం­ధన కింద ని­రా­క­రిం­చా­రో కూడా పే­ర్కొ­న­లే­ద­ని ఆయన అభ్యం­త­రం వ్య­క్తం చే­శా­రు. దీం­తో ఆయన రా­ష్ట్ర ప్ర­ధాన సమా­చార కమి­ష­న్‌­ను ఆశ్ర­యిం­చా­రు. ఈ ఫి­ర్యా­దు­పై సీ­ఐ­సీ వి­చా­రణ చే­ప­ట్టిం­ది. వి­చా­రణ సం­ద­ర్భం­గా ఫి­ర్యా­దు దా­రు­డు పట్నా­య­క్‌­తో పాటు ఆలయ డి­ప్యూ­టీ కమి­ష­న­ర్ కూడా హా­జ­రై తమ వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆలయ అధి­కా­రుల తర­ఫున డి­ప్యూ­టీ కమి­ష­న­ర్ మా­ట్లా­డు­తూ, 2018లో హై­కో­ర్టు ఇచ్చిన ఒక తీ­ర్పు ప్ర­కా­రం ఆల­యా­లు సమా­చార హక్కు చట్టం పరి­ధి­లో­కి రా­వ­ని తమకు అవ­గా­హన ఉం­ద­ని తె­లి­పా­రు. అదే కా­ర­ణం­తో సమా­చా­రా­న్ని అం­దిం­చ­లే­ద­ని వి­వ­రిం­చా­రు..

హైకోర్టు నుంచి కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు తాము ఈ విషయంలో ముందుకు వెళ్లలేమని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ అంశాన్ని సీఐసీ సమగ్రంగా పరిశీలించింది. ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టులు ఇలాంటి అంశాలపై ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధీనంలో లేదా ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న మత సంస్థలు ప్రజా సంస్థలుగా పరిగణించబడతాయని కమిషన్ అభిప్రాయపడింది.

Tags

Next Story