AP : ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

AP : ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
X

ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. రెండో జాబితాలో 59 మందికి అవకాశం కల్పించింది. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో కసరత్తు చేసిన తర్వాత.. సీఎం చంద్రబాబు పేర్లు ఫైనల్ చేశారు. టీడీపీలో ముఖ్య నేతలకు పదవులు దక్కాయి. కార్పొరేషన్ పదవుల్లో టీడీపీకి 43, జనసేనకు 10, బీజేపీకి 3 లభించాయి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్‌ చైర్మన్‌గా పట్టాభిరామ్‌, ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా జీవీ రెడ్డి, రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుకు పదవులు దక్కాయి. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది.

Tags

Next Story