కుప్పంలో చంద్రబాబు పర్యటన..

కుప్పంలో చంద్రబాబు పర్యటన..
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌ స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌ స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలకు ప్లాన్ చేస్తున్నారు. డీసీసీ మాజీ ప్రెసిడెంట్ సురేష్‌బాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. అటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బహిరంగ సభలో లక్ష మెజార్టీ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story