ధైర్యం ఉంటే.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయండి- అశోక్‌ బాబు

ధైర్యం ఉంటే.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయండి- అశోక్‌ బాబు
చంద్రబాబు హయాంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగుల జీతాలు ఆగిన సందర్భం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు.

చంద్రబాబు హయాంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగుల జీతాలు ఆగిన సందర్భం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు. వైసీపీ ప్రభుత్వంలో 7వ తేదీకి కూడా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌లు అందడం లేదన్నారు.

ఇటు జీతాలు ఇవ్వడంలేదు.. అటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లింపులు చేయడం లేదంటూ విమర్శించారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్ధిక శాఖ పరిస్థితిపై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఆపి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ధైర్యం ఉంటే.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయండి- అశోక్‌ బాబుఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి తొత్తులుగా మారడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కరోనాతో దెబ్బతింది వ్యాపారులు, ప్రజలు మాత్రమే అని అన్నారు. ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రి ఉన్నారా లేదా అన్న అనుమానం వస్తుంది అని అశోక్‌బాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Tags

Next Story