GOA Governor : గవర్నర్ హోదాలో తొలిసారిగా ఏపీకి అశోక గజపతి రాజు.. ఘనస్వాగతం పలికిన అధికారులు..

X
By - Manikanta |1 Sept 2025 7:45 PM IST
గోవా గవర్నర్ హోదాలో తొలిసారిగా తన సొంత గడ్డపై అడుగుపెట్టారు పూసపాటి అశోకగజపతిరాజు. విజయనగరం జిల్లాలోని తన స్వగృహానికి చేరుకున్న ఆయనకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అశోక్ గజపతిరాజు అక్కడ ఉన్నవారిని ఆప్యాయంగా పలకరించారు. గోవా గవర్నర్ హోదాలో తొలిసారిగా తన నివాసానికి వచ్చిన అశోక్ గజపతిరాజును చూసి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అశోక్ గజపతిరాజును దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com