కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు : అచ్చెన్నాయుడు

కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు : అచ్చెన్నాయుడు
మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.

మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకున్నది రాజధాని కోసమేనని గుర్తు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా..? ఎస్టీనా..? ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు ఎలా పెడతారు..? అని ప్రశ్నించారు.

రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా.. జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామని అచ్చెన్న అన్నారు. అసైన్డ్ భూముల్లో ఇల్లు కట్టుకున్న చరిత్ర జగన్‌రెడ్డిదేనని, ఇడుపులపాయలో 700 ఎకరాల అసైన్డ్ భూములు 30 ఏళ్లు అనుభవించింది వారేనని అన్నారు. ఈ విషయం బయటపడడంతోనే 610 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేశారని చెప్పారు. జగన్ ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని, రాజకీయ దురుద్దేశంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story