Atchannaidu: సీఎం చెప్పిన మాటలు అవాస్తవం - అచ్చెన్నాయుడు

Atchannaidu: సీఎం చెప్పిన మాటలు అవాస్తవం - అచ్చెన్నాయుడు
X
Atchannaidu: మద్యం ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేసే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని.. అచ్చెన్నాయుడు విమర్శించారు.

Atchannaidu: మద్యం ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేసే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఏపీలో మద్యం బ్రాండ్లు, కల్తీ సారా ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వైసీపీ సర్కార్ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోందని ఆరోపించారు. జగన్‌ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న అచ్చన్న.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందన్నారు. ఇక వైసీపీ నేతల బినామీలే డిస్టలరీలు నడుపుతున్నారన్న ఆయన.. అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

Tags

Next Story