Atmakur: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయం..

Atmakur: ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. 82 వేల 888 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై గెలుపొందారు విక్రమ్‌రెడ్డి. తొలి రౌండ్ నుంచే వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి అభ్యర్ధి భరత్‌కు కేవలం 19 వేల 352 ఓట్లు పోలయ్యాయి.
బీఎస్పీ అభ్యర్థి ఓబులేష్‌కు 4,897 ఓట్లు పోలయ్యాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ నెల 23న అసెంబ్లీ ఉపఎన్నిక జరిగింది. కౌంటింగ్ పాలెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ డిపాజిట్ కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com