AP : ఏపీ మంత్రి కొడుకు వాహనంపై దాడి.. నంద్యాలలో కలకలం

ఏపీ మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ కుమారుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. నంద్యాల పట్టణం రాజ్ థియేటర్‌లోని తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వాహనానికి అడ్డంగా మోటార్ సైకిల్ పెట్టి దాడికి యత్నించారు. ఫిరోజ్ అనుచరులు అప్రమత్తమై వారిలో ఒకరిని పట్టుకోగా.. మిగతా ముగ్గురు పారిపోయారు. పట్టుబడిన నిందితుడిని నంద్యాల వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.
ఈ నెల 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి బ్యానర్‌ను చించి తగలబెట్టినందుకు మద్యం మత్తులో భూమా అనుచరుడు వెంకటేశ్వర రెడ్డి, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి, మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ కుమారుడిపై దాడికి యత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com