Avanthi Srinivas: టీవీ5 ప్రతినిధిపై మాజీ మంత్రి చిందులు.. సహనం కోల్పోయి..

Avanthi Srinivas: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు పట్టరాని కోపం వచ్చింది.. సహనం కోల్పోయి ఆ కోపాన్నంతా టీవీ5 ప్రతినిధిపై చూపించాడు.. ఎలాంటి ఫీడ్ పెడతారో అర్థం కావడం లేదంటూనే.. ఏయ్, ఒరేయ్ అంటూ విచక్షణ మరచిపోయి విరుచుకుపడ్డారు.. విశాఖలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి అవంతి ప్రవర్తించిన తీరు విమర్శలకు కారణమవుతోంది..
రైతు భరోసా అందలేదని ఓ రైతు తన గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేయగా.. అతన్ని పోలీసులు బలవంతంగా అక్కడ్నుంచి పంపించబోయారు.. ఈ వ్యవహారాన్ని టీవీ5 ప్రతినిధి చిత్రీకరించారు.. దాన్ని చూసిన అవంతి శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు.. తన అక్కసునంతా టీవీ5 ప్రతినిధిపై ప్రదర్శించారు. అసలు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా..?
ఇటీవల గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో జనం వద్దకు వెళ్లిన అవంతికి పరాభవం ఎదురైంది.. జనం ఆయనపై తిరగబడ్డారు.. ఈ సీన్‌ను టీవీ5 ప్రసారం చేసింది.. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలకు ఎదురవుతున్న పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించింది.. అవంతికే కాదు.. మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా అందుకే మంట.. అసలేం జరిగిందో.. ఆ రోజు టీవీ5 ఏం ప్రసారం చేసిందో ఓసారి చూద్దాం.
ఇదీ సంగతి.. కట్టుకథలు, కహానీలు కాదు.. ఉన్నది ఉన్నట్లుగా టీవీ5 చూపించింది.. అందుకే మంత్రులకు, మాజీలకు, వైసీపీ నేతలకు పట్టారని కోపం వస్తోంది.. ఏంటో గానీ.. టీవీ5 అంటే వైసీపీ నేతలకు భయ పట్టుకున్నట్లుంది.. ఆ కోపంతో అంతు చూస్తానంటూ పబ్లిక్‌గానే బెదిరింపులకు దిగుతున్నారు. ఇదీ ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com