Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట.. టీడీపీ కార్యకర్తల సంబరాలు..

Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు.. ఆయన ఇంటి జోలికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నర్సీపట్నంలో ఇల్లు కూల్చివేతపై అయ్యన్నపాత్రుడు కుమారులు చింతకాలయ విజయ్, రాజేష్ ఆదివారం హైకోర్టులో హౌస్‌మోసన్ పిటీషన్ దాఖలు చేశారు. పిటీషనర్ల తరుపున న్యాయవాది సతీష్ వాదనలు వినపించారు. అధికారులు ఆమోదించిన ప్లాన్‌కి అనుగుణంగానే పిటిషనర్లు ఇంటి నిర్మాణం చేసినట్లు తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం.. రాత్రి సమయంలో కూల్చివేతలు ఏమిటంటూ అధికారులను నిలదీసింది. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేయకూడదని గుర్తు చేసింది. కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చిరించింది. అటు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో.. అయ్యన్నపాత్రుడి ఇంటివద్దకు భారీగా చేరుకుని సంబరాలు చేసుకున్నారు అభిమానులు, కార్యకర్తలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com