ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు బెయిల్ మంజూరు
ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని సూచించింది. అరెస్ట్ సందర్భంగా.... పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. . అనంతరం బెయిల్ మంజూరు చేశారు. అటు... ఉదయం కొల్లు రవీంద్ర అరెస్ట్‌తో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల తీరును నిరసిస్తూ రవీంద్ర ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో.. ఉద్రిక్తత నెలకొంది.
నిన్న విజయవాడలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో 25వ బూత్‌ను. పరిశీలించేందుకు వెళ్లిన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంలో..పోలీసులు, రవీంద్రకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా నేలపై బైఠాయించి రవీంద్ర నిరసన తెలిపారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కొల్లు రవీంద్ర తెలిపారు. సంబంధం లేని విషయాల్లో ఇరికించి.. పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
కొల్లు రవీంద్ర అరెస్ట్ అక్రమమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాల్ని అడ్డుకున్న బీసీల్ని వేధిస్తారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ బీసీ వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. పండగ పూట కూడా బీసీల్ని జగన్ ప్రభుత్వం సంతోషంగా ఉండనీయడం లేదని మండిపడ్డారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లి.. దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు, దాడులు, అరెస్ట్‌లు పతాక స్థాయికి చేరాయని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com