Balakrishna: వైసీపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ బాలకృష్ణ..

Balakrishna (tv5news.in)
Balakrishna: వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా రైతులు, ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటు చేసిన రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు రాయలసీమ జిల్లాల నుంచి టీడీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
వైసీపీ ప్రభుత్వ వైఖరిని, రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు బాలకృష్ణ. టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా జలాలను హిందూపురం తీసుకొచ్చిన ఘనత తమకే దక్కుతుందని బాలకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని అన్ని చెరువులకు సమృద్ధిగా నీటిని నింపి రైతులను ఆదుకుంటే ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితే లేదన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హిందూపురం ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com