AP : అన్నాచెల్లెళ్లు వైఎస్ పరువు తీస్తున్నారు... బాలినేని ఫైర్

AP : అన్నాచెల్లెళ్లు వైఎస్ పరువు తీస్తున్నారు... బాలినేని ఫైర్
X

షర్మిల, జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డిని బజారుకీడుస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో ఖర్చుపెట్టుకున్నానని... ఆస్తులు అమ్మి అప్పులు కట్టానన్నారు. తాను ఆస్తులు పోగొట్టుకుంటే, మీరు ఆస్తుల కోసం కొట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తాము ఆర్థికంగా బలపడ్డామంటే దానికి విజయమ్మే కారణమన్నారు. షర్మిల వెనుక చంద్రబాబు, కూటమి ఉందనడం సమంజసం కాదన్నారు. కుటుంబ తగాదాని కూటమికి అంటగడుతున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై విజయమ్మే జడ్జిమెంట్‌ ఇవ్వాలని కోరారు. తాను మళ్లీ వెనక్కి వెళ్ళిపోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Tags

Next Story