Balineni Srinivasa Reddy: జగన్‌తో భేటీ తర్వాత అలక వీడిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి..

Balineni Srinivasa Reddy: జగన్‌తో భేటీ తర్వాత అలక వీడిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి..
X
Balineni Srinivasa Reddy: మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి

Balineni Srinivasa Reddy: మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. సీఎం జగన్‌తో భేటీ తర్వాత అలకవీడారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. బాలినేని జగన్‌ బుజ్జగించారని, ఆయన సేవలను మరోవిధంగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జగన్‌తో భేటీ తర్వాత బాలినేని మాట్లాడుతూ.. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాజీనామా వార్తలను ఖండించిన ఆయన జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించినా బాధ్యతగా పనిచేస్తానన్నారు.

Tags

Next Story