Jana Sena : జనసేనలోకి వెళ్లడంపై బాలినేని సంచలన ప్రకటన

Jana Sena : జనసేనలోకి వెళ్లడంపై బాలినేని సంచలన ప్రకటన
X

"నేను ఎక్కడికి పారిపోలేదు" అంటూ వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని శ్రీనివాస్‌ ( Balineni Srinivasa Reddy ) సంచలన ప్రకటన చేశారు. నేను ఎక్కడికి పారిపోను.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా..అవినీతి జరిగితే ప్రజాపోరాటం చేస్తానని వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి…గత 25 ఏళ్లలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు.

ఎన్నికలకు ముందు నేను ఇవే నా చివరి ఎన్నికలు అని ముందే చెప్పానన్నారు బాలినేని. ఎవరి ఆలోచన ఏంటో ప్రజలు నన్ను గెలిపించలేదని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా ఏమీ అనలేదు..ఫలితాల అనంతరం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం చేశారని తెలిపారు.

గతంలో తాము ఇలానే చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదని ఎదురు ప్రశ్నించారు బాలినేని. రాజకీయాలు తాను వద్దనుకున్న సమయంలో తమ కార్యకర్తలపై దాడులు చేసి తనను తిరిగి తీసుకువచ్చి రాజకీయం చేయిస్తున్నారనీ.. తాను ఎక్కడకు వెళ్ళేది లేదు.. ఒంగోలులోనే ఉంటానని చెప్పారు. జనసేన లోకి వెళ్తున్నానని ప్రచారాలు చేస్తున్నారనీ.. ఇవి కరెక్ట్ కాదన్నారు.

Tags

Next Story