AP : ఏపీలో ఎక్కడ చూసినా బెల్టు షాపులు

X
By - Manikanta |28 Oct 2024 5:00 PM IST
ఏపీలో మద్యం వ్యాపారం ఎలా సాగుతుందో తెలిపే వీడియో వైరల్ అవుతోంది. మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెడుతున్నారు. ఓ మార్కెట్ ఏరియాలో కూడా మద్యం బెల్టు షాపును నిర్వహిస్తున్నారు. ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సంత మార్కెట్ లో ఓ వ్యక్తి మద్యం బాటిళ్లతోపాటు గ్లాసులు సైతం ఏర్పాటు చేసి దుకాణం తెరిచాడు. వీడియో వైరల్ కావడంతో తణుకు ఎక్సైజ్ పోలీసులు బెల్ట్ షాప్పై దాడి చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి నగదుతోపాటు 60 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి జిల్లాలో అనేక చోట్ల ప్రైవేట్ షాపులకు అనుబంధంగా మద్యం బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com