AP : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బొత్స
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. విశాఖ కలెక్టరేట్‌లో ఆయన నామపత్రాలు దాఖలు చేశారు. అటు టీడీపీ బరిలో ఉంటుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 838 ఓట్లలో తమకు 500 పైగా ఓట్లు ఉన్నాయని, గెలుపు తనదేనని బొత్స ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ లేకున్నా టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్యే అవుతుందని ఆయన విమర్శించారు. అయితే, విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి వైపే కూటమి మొగ్గుచూపుతుందన్న ప్రచారం సాగుతోంది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.. వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అనుకున్నట్టుగా జరిగితే.. బొత్సను ఢీకొనబోతున్నారు బైరా దిలీప్ చక్రవర్తి.. దాదాపు బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్టు వినిపిస్తోంది.. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తిని.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధం అవుతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, హైకమాండ్ నుంచి పోటీపై.. అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com