Anantapur : దోశ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి.. అనంతపురం జిల్లాలో విషాదం..

Anantapur : దోశ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి.. అనంతపురం జిల్లాలో విషాదం..
X

చిన్న పిల్లల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. వాళ్లు ఏం తింటున్నారు..? ఏం చేస్తున్నారనే విషయాలను గమనిస్తూనే ఉండాలి. కొంచెం హేమరపాటుగా ఉన్నా ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఇటువంటి ఘటనే ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. దోశ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. అనంతపురం నగరం తపోవనంలో ఉండే అభిషేక్, అంజినమ్మలకు రెండేళ్ల కొడుకు కుశాల్‌ ఉన్నాడు. శుక్రవారం ఉదయం దోశ తింటుండగా ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక బాలుడు కింద పడిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, కొద్దిసేపటికే మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్ల ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Tags

Next Story