Chandrababu Naidu : తమ్ముళ్లు జాగ్రత్త.. చంద్రబాబు వార్నింగ్

Chandrababu Naidu : తమ్ముళ్లు జాగ్రత్త.. చంద్రబాబు వార్నింగ్
X

సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా ఉంటున్నారు. గతంలో మాదిరి కార్యకర్తలను ఇబ్బంది పెడితే అస్సలు ఊరుకోవట్లేదు. అంతకుముందు ఆయన ఏపీ అభివృద్ధి మీద పూర్తిగా దృష్టిసారించి కింది స్థాయిలో ఉన్న టిడిపి కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని పెద్దగా పసిగట్టలేకపోయారు. అది 2019లో ఏకంగా అధికారాన్ని దూరం చేసే దాకా వెళ్ళింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అసోంటి తప్పు మరొకసారి జరగవద్దని చాలా సీరియస్ గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా టిడిపి నేతల పనితీరుపై.. వాళ్ల వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. అవసరమైతే పార్టీ నుంచి తీసేసేందుకు కూడా వెనకాడట్లేదు. మొన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారిద్దరిని పిలిచి మాట్లాడుతానని చెప్పినా సరే.. చంద్రబాబు నాయుడు వద్దన్నారు.

తానే స్వయంగా వాళ్ళిద్దరితో మాట్లాడి డీల్ చేస్తానన్నారు. వాళ్ళిద్దరూ వినకపోతే ఎవరో ఒకరిని వదులుకునేందుకు కూడా సిద్ధమని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు నాయుడు ఇంతటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు టిడిపి నేతలు ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో టిడిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి నేతల తీరుతో కిందిస్థాయి టిడిపి కార్యకర్తలు చాలా విసిగిపోయారు. 2019 ఎన్నికల సమయంలో వారంతా తమ ఎమ్మెల్యే గెలవకపోయినా సరే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకున్నారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలు ఇలాగే కోరుకోవడం వల్ల టిడిపి ఓడిపోయి వైసీపీ భారీ మెజార్టీతో గెలవడానికి అవకాశం కల్పించినట్టు అయింది.

ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా ఏపీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులతో పాటు విశాఖలో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రావడం వల్ల ఏపీ డెవలప్మెంట్ స్పీడ్ గా వెళ్తోంది. మరో రెండు టర్మ్ లు కూటమి ప్రభుత్వమే ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే కూటమినేతల మధ్య గానీ, టిడిపి నేతల మధ్య గానీ ఎలాంటి వివాదాలు ఉన్నా సరే వాళ్లను అస్సలు ఉపేక్షించట్లేదు. తన మాట వినకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. చాలామంది వైసిపి హయాంలో ఆ పార్టీలో ఉండి టిడిపి కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన కొంతమంది.. ఇప్పుడు టిడిపి పార్టీలోకి వచ్చి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల పక్కన చేరి మళ్ళీ అదే కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. అందుకే ఆ నేతల మాటలను పట్టుకొని కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. కాబట్టి టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు కార్యకర్తల విషయంలో, చంద్రబాబు నాయుడు ఆదేశాల విషయంలో అతి తూచి వ్యవహరించాల్సిందే.


Tags

Next Story