Konaseema District : కోనసీమలో పశువుల అందాల పోటీలు

కోనసీమ జిల్లాలో పశువుల అందాలు పోటీలు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆవులు, ఎద్దులు పాల్గొంటున్నాయని నిర్వహకుడు అడబాల లక్ష్మినారాయణ తెలిపారు. ఈ పోటీలు కోనసీమ జిల్లాలో కేశినేనిపల్లి గ్రామంలో నిర్వహించడం తొలిసారి అని ఆయన తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన పశువులకు ప్రధమ, ద్వితీయ,తృతీయ, క్యాటగిరిలో నగదు బహుకరణ అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోనసీమ ఇంచార్జ్ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు,అంబేద్కర్ కోనసీమజిల్లా చెందిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్, హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు రెండు వందలకు పైగా ఒంగోలు, పుంగనూరు గిరి ఆవులు ఈ ప్రదర్శనశాలకు చేరుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com