CBN: అందేశ్రీ మృతి పట్ల చంద్రబాబు సంతాపం

CBN: అందేశ్రీ మృతి పట్ల చంద్రబాబు సంతాపం
X
తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్న చంద్రబాబు

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. " తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు. అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిస్తుందన్నారు. కొట్లాది ప్రజలు గొంతుకై నిలిచారని పేర్కొన్నారు.

అందెశ్రీ రాసిన సినీ పాటలు

ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ.. అనేక సినీ గేయాలను కూడా రచించారు. పల్లెనీకు వందనములమ్మో, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జనజాతరలో మన గీతం, చూడ చక్కని తదితర గీతాలు రాశారు. బతుకమ్మ(2008) సినిమాకు సంభాషణలు రాశారు. 'గంగ' సినిమాలో రాసిన 'యెల్లిపోతున్నావ తల్లి' పాటకుగానూ ఉత్తమ గీత రచయితగా 2006లో నంది అవార్డు అందుకున్నారు. తన సహజసిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా, తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా అందెశ్రీ ఎదిగిన తీరు ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక గాథ. వరంగల్ జిల్లా రేబర్తి అనే ఓ మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన ఆయన.. చిన్నతనంలో గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు.

Tags

Next Story