CBN: టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం

CBN: టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం
X
48 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు.. 48 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ అధి­కార పా­ర్టీ­లో కీలక పరి­ణా­మం చోటు చే­సు­కుం­ది. ప్ర­భు­త్వం ఏర్ప­డి ఏడా­ది­న్నర అవు­తు­న్నా ప్ర­జ­ల్లో­కి కొం­ద­రు ఎమ్మె­ల్యే­లు వె­ళ్ల­క­పో­వ­డం­పై సీఎం చం­ద్ర­బా­బు తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. పలు­మా­ర్లు హె­చ్చ­రిం­చి­న­ప్ప­టి­కీ తీరు మా­ర­క­పో­వ­డం­తో కఠిన ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని భా­విం­చా­రు. ఈ మే­ర­కు సం­చ­లన ఆదే­శా­లు జారీ చే­శా­రు. పిం­ఛ­న్లు, సీ­ఎం­ఆ­ర్ఎ­ఫ్ చె­క్కుల పం­పి­ణీ­లో48 మంది ఎమ్మె­ల్యే­లు పా­ల్గొ­న­డం­లే­ద­ని గు­ర్తిం­చా­రు. వా­రం­ద­రి­కీ నో­టీ­సు­లు ఇవ్వా­ల­ని కూ­ట­మి పా­ర్టీ అధ్య­క్షు­ల­ను ఆదే­శిం­చా­రు. స్వ­యం­గా తాను లబ్ధి­దా­రు­ల­ను కలి­సి పిం­ఛ­న్లు అం­ది­స్తు­న్న­ప్పు­డు ఎమ్మె­ల్యే­లు ఎం­దు­కు ప్ర­జ­ల­కు సే­వ­లం­దిం­చ­డం­లే­ద­ని మం­డి­ప­డ్డా­రు. ఎమ్మె­ల్యే­లు తమ ని­యో­క­వ­ర్గా­ల్లో ప్ర­జా దర్బా­ర్ ని­ర్వ­హిం­చా­ల్సి­దే­న­న్నా­రు. ప్ర­తి ని­త్యం ప్ర­జ­ల్లో ఉండి సమ­స్య­లు తె­లు­సు­కు­ని పరి­ష్క­రిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. ఎవరూ బే­ఖా­త­రు చే­సి­నా భవి­ష్య­త్తు­లో పరి­ణా­మా­లు తప్ప­వ్ అని చం­ద్ర­బా­బు నా­యు­డు హె­చ్చ­రిం­చా­రు. వి­వ­రణ తీ­సు­కు­న్నాక చర్య­ల­కూ వె­న­కా­డ­బో­మ­ని ఆయన హె­చ్చ­రిం­చా­రు. పా­ర్టీ కోసం కష్ట­ప­డి పని­చే­సే కా­ర్య­క­ర్త­ల­ను కలు­పు­కొ­ని వె­ళ్లా­ల­ని సూ­చిం­చా­రు. బ్యా­క్ ఆఫీ­సు, ప్రో­గ్రాం కమి­టీ­కి ఆదే­శా­లు జారీ చే­స్తూ, ఆ ఎమ్మె­ల్యే­ల­కు నో­టీ­సు­లు ఇచ్చి వి­వ­రణ కో­రా­ల­ని సూ­చిం­చా­రు. వి­వ­రణ సం­తృ­ప్తి­క­రం­గా లే­క­పో­తే చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని హె­చ్చ­రిం­చా­రు. పేదల సే­వ­లో భా­గం­గా పె­న్ష­న్ల పం­పి­ణీ­లో మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు తప్ప­కుం­డా పా­ల్గొ­నా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­ని, కా­ర్య­క­ర్త­లు, ప్ర­జ­ల­తో మా­ట్లా­డా­ల­ని సూ­చిం­చా­రు. టీ­డీ­పీ కా­ర్య­క­ర్త­ల­కు ఇన్సు­రె­న్స్, సీ­ఎం­ఆ­ర్‌­ఎ­ఫ్ చె­క్కుల పం­పి­ణీ­లో కూడా ఎమ్మె­ల్యే­లు తప్ప­కుం­డా పా­ల్గొ­నా­లి.

పనితీరు మారకపోతే పక్కన పెట్టాలి

పే­ద­ల­కు ఎన్నో­క­ష్టా­ల్లో ఉంటే సీ­ఎం­ఆ­ర్ఎ­ఫ్ కు దర­ఖా­స్తు చే­సు­కుం­టా­రు. వా­రి­కి మం­జూ­రు అయిన డబ్బు­లు కూడా ఇవ్వ­డా­ని­కి ఎమ్మె­ల్యే­ల­కు తీ­రిక లే­క­పో­తే ఇక వా­రి­కి ప్ర­జా సేవ చే­య­డా­ని­కి అర్హత ఏముం­టుం­ద­న్న ప్ర­శ్న­లు వస్తు­న్నా­యి. సీఎం ఆర్ఎ­ఫ్ చె­క్కు­ల­కు మూడు నెలల పరి­మి­తి ఉం­టుం­ది. ఇష్యూ చే­సిన తేదీ నుం­చి మూడు నెలల పాటు చె­క్కు­లు పం­పి­ణీ చే­య­క­పో­వ­డం వల్ల అవి తి­రి­గి వస్తు­న్నా­యి . కొ­త్త­గా చె­క్కు­లు జారీ చే­యా­ల్సిన పరి­స్థి­తి వస్తోం­ది. ఇది సీ­ఎం­ను అస­హ­నా­ని­కి గురి చే­సిం­ది. ఇప్ప­టి వరకూ చూ­శా­మ­ని ఇక పని­తీ­రు మా­ర్చు­కో­క­పో­తే పక్కన పె­ట్టా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్న­ట్లు­గా తె­లు­స్తోం­ది. ప్ర­తి శు­క్ర­వా­రం ని­యో­జ­క­వ­ర్గ టీ­డీ­పీ కా­ర్యా­ల­యా­ల్లో జరి­గే ప్ర­జా వి­జ్ఞ­ప్తుల కా­ర్య­క్ర­మం­లో ఎమ్మె­ల్యే­లు పా­ల్గొ­నా­లి. పా­ల్గొ­న­క­పో­తే పా­ర్టీ కేం­ద్ర కా­ర్యా­ల­యం వి­వ­రణ తీ­సు­కో­వా­లి ఆదే­శిం­చా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం అభి­వృ­ద్ధి, సం­క్షేమ కా­ర్య­క్ర­మా­ల­కు గతం­లో కంటే ఎక్కువ ప్రా­ధా­న్యం ఇస్తోం­ద­న్నా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ని­ర్ణ­యం­తో ఏపీ టీ­డీ­పీ ఎమ్మె­ల్యే­ల్లో కొ­త్త టె­న్ష­న్ మొ­ద­లైం­ది.

బిహార్‌లో మంత్రి లోకేశ్‌ ప్రచారం

బి­హా­ర్‌­‌­‌­‌­లో ఫస్ట్ ఫేజ్ అసెం­బ్లీ ఎన్ని­క­లు ము­గి­శా­యి. 11న సె­కం­డ్ ఫేజ్ పో­లిం­గ్ జర­గ­నుం­ది. ఈ క్ర­మం­లో బీ­జే­పీ స్పీ­డు పెం­చిం­ది. ఏపీ మం­త్రి నారా లో­కే­శ్.. ఎన్డీఏ తర­ఫున ఎన్ని­కల ప్ర­చా­రం చే­య­ను­న్నా­రు. కల్యా­ణ­దు­ర్గం పర్య­టన ము­గిం­చు­కొ­ని నారా లో­కే­శ్ పట్నా చే­రు­కు­న్నా­రు. రెం­డు రో­జు­ల­పా­టు ఎన్డీ­యే అభ్య­ర్థుల తర­ఫున లో­కే­శ్ ప్ర­చా­రం చే­య­ను­న్నా­రు. రెం­డో దశలో 122 ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ఎన్ని­క­లు జర­గ­ను­న్నా­యి. తె­లు­గు ప్ర­జ­లు ఉన్న­చోట లో­కే­శ్ ప్ర­చా­రం సా­గ­నుం­ది.

Tags

Next Story