CBN: జగన్.. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా.? చంద్రబాబు

CBN: జగన్.. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా.? చంద్రబాబు
X
వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్

‘మొ­న్న­టి వరకు వై­సీ­పీ నే­త­లు సి­ద్ధం, సి­ద్ధం అంటూ ఎగి­రి­ప­డ్డా­రు. అసెం­బ్లీ­కి వచ్చేం­దు­కు సి­ద్ధ­మా..! అభి­వృ­ద్ధి­పై చర్చ­కు వచ్చేం­దు­కు సి­ద్ధ­మా. మొ­న్న జరి­గిన పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట ఎన్ని­క­ల­పై చర్చ­కు సి­ద్ధ­మా. వి­వే­కా హత్య, కోడి కత్తి డ్రా­మా, గు­ల­క­రా­యి నా­ట­కా­ల­పై చర్చ­కు సి­ద్ధ­మా అంటూ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు వై­సీ­పీ ఎమ్మె­ల్యే­ల­కు సవా­ల్​­వి­సి­రా­రు. క్లై­మో­ర్ మై­న్ల­తో పే­ల్చి­నా తాను చలిం­చ­లే­ద­ని, మీలా డ్రా­మా­లు ఆ డ లే­ద­ని పే­ర్కొ­న్నా­రు. అన్న­మ­య్య జి­ల్లా రా­జం­పే­ట­లో ఇవాళ పేదల సే­వ­లో కా­ర్య­క్ర­మం ని­ర్వ­హిం­చా­రు. రా­జం­పేట మం­డ­లం ము­న­క్కా­యల వా­రి­ప­ల్లె­లో లబ్ధి­దా­రు­ల­కు పిం­ఛ­న్లు పం­పి­ణీ చే­శా­రు. ది­వ్యాం­గు­రా­లు సు­మి­త్ర­మ్మ­కు పిం­ఛ­న్​ అం­దిం­చా­రు. అనంతరం బోయినపల్లి ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు

రా­జ­కీయ జీ­వి­తం­లో తాను ఏనా­డూ వి­శ్రాం­తి తీ­సు­కో­లే­ద­ని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. పి­ల్ల­ల­కు బం­గా­రు భవి­ష్య­త్‌ అం­దిం­చా­ల­నే­దే తన ఆశ­య­మ­న్నా­రు. ఎవ­రై­నా పిం­ఛ­ను తీ­సు­కో­కు­న్నా తర్వా­తి నెల అం­ది­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. "ప్ర­పం­చం­లో ఎక్క­డి­కి వె­ళ్లి­నా తె­లు­గు­వా­ళ్లు కని­పి­స్తా­రు. ఉన్నత వి­ద్య, ఉపా­ధి, వ్యా­పా­రాల కోసం వి­దే­శా­ల­కు వె­ళ్తు­న్నా­రు. గత పా­ల­కు­లు అధి­కా­రా­న్ని స్వా­ర్థ ప్ర­యో­జ­నా­ల­కు వా­డు­కు­న్నా­రు. వై­కా­పా హయాం­లో అన­ర్హు­లు కూడా ది­వ్యాం­గుల పిం­ఛ­ను తీ­సు­కు­న్నా­రు. ని­జ­మైన ది­వ్యాం­గు­ల­కు మేం న్యా­యం చే­స్తాం. అన­ర్హు­లు పిం­ఛ­ను తీ­సు­కో­కుం­డా ప్ర­జ­లే ఆపా­లి. మహి­ళల ఆత్మ­గౌ­ర­వం దె­బ్బ­తీ­స్తే కఠిన చర్య­లు తప్ప­వు."అన్నా­రు.

అరాచక వ్యక్తులు

పల్నాడు జిల్లాలో వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారు. తిరిగి మాపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌లో చనిపోయాడంటూ అతడి భార్యతోనే అబద్ధాలు చెప్పించారు. మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారు. ఆడబిడ్డలపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మహిళలను ఏడిపించిన వారిని చట్టం ఎదుట నిలబెడతాం’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘కరవు సీమకు సాగునీటిని తీసుకురావడానికి పునాదులు వేసింది ఎన్టీఆరే. కుప్పానికి నీరు తీసుకెళ్లాను. భవిష్యత్తులో రాజంపేట, రైల్వేకోడూరు, చిత్తూరు ప్రాంతాలకూ సాగు నీరిస్తాం. సీమకు పెద్దఎత్తున పెట్టుబడులు రప్పిస్తున్నాం. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్టయింది. నా బలం.. బలగం ప్రజలే. ఏటా లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం’ అని సీఎం తెలిపారు.

Tags

Next Story