CBN: జనమే ఆస్తి...జనాభానే పెట్టుబడి: చంద్రబాబు

CBN: జనమే ఆస్తి...జనాభానే పెట్టుబడి: చంద్రబాబు
X
ముగ్గురి కంటే ఎక్కువమందిని కనాలి... పాలసీలు మార్చాల్సిందేనంటూ వ్యాఖ్యలు.. జనాభా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు

"జనా­భా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పె­ద్ద పె­ట్టు­బ­డి" అని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. ప్ర­పంచ జనా­భా ది­నో­త్స­వా­న్ని పు­ర­స్క­రిం­చు­కు­ని ఏపీ సచి­వా­ల­యం దగ్గర ని­ర్వ­హిం­చిన కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న చం­ద్ర­బా­బు... జనా­భా­పై కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. జనా­భా ని­యం­త్రణ కాదు.. ని­ర్వ­హణ చే­యా­ల­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. జనా­భా అనే­ది భారం కా­కుం­డా ఆస్తి­గా భా­విం­చే కాలం వచ్చిం­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. భా­ర­త­దే­శం­లో ఎక్కువ జనా­భా ఉం­డ­టం మనకు పె­ద్ద వన­ర­ని అన్నా­రు. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా యు­వ­శ­క్తి క్షీ­ణిం­చి అభి­వృ­ద్ధి కూడా తగ్గి­పో­తోం­ద­ని చం­ద్ర­బా­బు కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఆర్థిక సం­స్క­ర­ణ­లు అం­ది­పు­చ్చు­కు­న్న తె­లు­గు­వా­రు అగ్ర­స్థా­నం­లో ఉన్నా­ర­ని తె­లి­పా­రు. " దే­శ­మం­టే మట్టి కా­దో­య్.. దే­శ­మం­టే మను­షు­లో­య్.. అని గు­ర­జాడ అప్పా­రా­వు చె­ప్పా­రు. దే­శ­మం­టే మను­షు­లు.. కష్టా­లు.. సమ­స్య­లు.. పరి­ష్కా­రం అన్నీ ఉం­టా­యి.. గు­ర­జాడ స్ఫూ­ర్తి­తో ముం­దు­కు వె­ళ్లా­లి.. ఇద్ద­రు పి­ల్ల­లు ఉంటే స్థా­నిక ఎన్ని­క­ల్లో పో­టీ­కి అన­ర్హు­లు అని నేనే చట్టం తీ­సు­కొ­చ్చా.. కానీ, ఒక్కో­సా­రి పా­ల­సీ­లు మా­ర్చు­కో­వా­ల్సిన పరి­స్థి­తి వస్తుం­ది.. ఇప్పు­డు జనా­భా భారం కాదు.. జనమే ఆస్తి అన్నా­రు చం­ద్ర­బా­బు.

జనాభా వల్ల అన్నీ లాభాలే..

" జనా­భా తక్కు­వుం­టే అవ­స­రాల ని­మి­త్తం ఇతర రా­ష్ట్రా­ల­కి తరలి వె­ళ్తా­రు.. జనా­భా ప్రా­తి­ప­ది­కన పా­ర్ల­మెం­ట్ స్థా­నా­లు ఉం­టా­యి.. జనా­భా పె­రి­గి­తే పా­ర్ల­మెం­ట్ స్థా­నా­లు పె­రు­గు­తా­యి, అవ­కా­శా­లు ఉం­టా­యి" అని చం­ద్ర­బా­బు అభి­ప్రా­య­ప­డ్డా­రు. తా­నె­ప్పు­డూ మహి­ళా పక్ష­పా­తి­న­ని.. ఆస్తి­లో మహి­ళ­ల­కి సమా­న­హ­క్కు కలి­పిం­చి ఎన్టీ­ఆ­ర్ మహి­ళల పక్షాన ని­ల­బ­డ్డా­ర­ని గు­ర్తు చే­శా­రు. జనా­భా ని­ర్వ­హ­ణ­లో ప్ర­తి ఒక్క­రు భా­గ­స్వా­మ్యం కా­వా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు.. త్వ­ర­లో జనా­భా ని­ర్వ­హ­ణ­పై డ్రా­ఫ్ట్ పా­ల­సీ తీ­సు­కొ­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.అయి­తే, మితి మీ­రిన ని­యం­త్రణ చర్య­లు వల్ల చాలా నష్ట­పో­యా­మ­ని చం­ద్ర­బా­బు ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. ఇప్పు­డు ఎంత మంది పి­ల్ల­లు ఉన్నా తల్లి­కి వం­ద­నం ఇస్తాం అని చె­ప్పి 15 వేలు ఇస్తు­న్నాం అన్నా­రు.. జనా­భా పె­రు­గు­దల కోసం అం­ద­రు కృషి చే­యా­ల­ని.... చైనా జనా­భా ని­యం­త్రణ వలన చాలా నష్ట పో­యిం­ద­ని.. జనా­భా పె­రు­గు­దల కోసం మా­ట్లా­డా­ల­ని సూ­చిం­చా­రు.

20 శాతం మంది పెళ్లిళ్లే వద్దంటున్నారు

దేశంలో 20 శాతం మంది పెళ్లి వద్దనుకుంటున్నారనే సర్వేలో వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం, ఉద్యోగం లేకపోవడం వలనే చాలామంది పిల్లలు వద్దనుకుంటున్నారన్న ఆయన.. ఈ పరి­స్థి­తు­ల­ను అధి­గ­మిం­చి.. జనా­భా పె­రు­గు­ద­ల­కు చర్య­లు తీ­సు­కో­వా­ల­న్నా­రు. దక్షిణ భారత దే­శం­లో ని­యో­జక వర్గాల సీ­ట్లు తగ్గు­తా­య­ని ఆం­దో­ళన చెం­దు­తు­న్నా­య­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. దా­ని­కి కా­ర­ణం జనా­భా ని­యం­త్రణ చర్య­లే­న­ని వె­ల్ల­డిం­చా­రు. ఉమ్మ­డి కు­టుం­బా­ల­ను ప్రో­త్స­హిం­చే పథ­కా­లు అమలు చే­యా­ల­న్నా­రు. " ఒక­ప్పు­డు జనా­భా ని­యం­త్రణ అన్నాం.. కానీ ఇప్పు­డు జనా­భా ని­ర్వ­హణ అం­టు­న్నాం.. తి­రి­గి ఉమ్మ­డి కు­టుం­బా­లు రా­వా­లి.. దాని కోసం ప్ర­త్యే­కం­గా ప్రో­త్సా­హ­కా­లు ఇవ్వా­లి.. పె­ద్ద కు­టుం­బా­ల­ను ప్రో­త్స­హిం­చే వి­ధం­గా పథ­కా­లు తీ­సు­కు­వ­స్తాం.. పా­పు­లే­ష­నే మనకు ఒక పె­ద్ద ఆస్తి.. జనా­భా నే మనకు అతి పె­ద్ద పె­ట్టు­బ­డి.. ఇప్పు­డు చాలా దే­శా­ల్లో వయసు మళ్లిన వారే అధి­కం­గా ఉన్నా­రు.. ఇప్ప­టి నుం­చి భావి తరాల భవి­ష్య­త్ కోసం జనా­భా ని­ర్వ­హణ కోసం అం­ద­రు సహ­క­రిం­చా­లి.. మొ­న్న­టి వరకు ఫ్యా­మి­లీ ప్లా­నిం­గ్ కోసం పని చే­శాం.. పా­పు­లే­ష­న్ మ్యా­నే­జ్మెం­ట్ కోసం పని చే­యాల" అని పి­లు­పు­ని­చ్చా­రు.

పాలసీలు మారాల్సిందే..

పరి­స్థి­తు­ల­కు అను­గు­ణం­గా పా­ల­సీ­లు మా­ర్చు­కో­క­పో­తే చాలా సమ­స్య­లు వస్తా­య­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. మంచి పా­ల­సీ ఏవి­ధం­గా తే­వా­ల­ని ఆలో­చి­స్తు­న్నా­మ­న్నా­రు. ప్ర­పంచ జనా­భా 500 కో­ట్ల­కు చే­రిన సం­ద­ర్భం­గా 1985 జులై 11న మొ­ద­టి­సా­రి ఐరాస ప్ర­పంచ జనా­భా ది­నో­త్స­వా­న్ని ని­ర్వ­హిం­చిం­ది. గతం­లో జనా­భా ఎక్కువ ఉన్న దే­శా­ల­ను చు­ల­క­న­గా చూ­సే­వా­ళ్లు. ఇప్పు­డు జనా­భా ఎక్కువ ఉన్న దే­శా­ల­పై ఆధా­ర­ప­డే పరి­స్థి­తి వచ్చిం­ది. జనమే ప్ర­ధాన ఆస్తి­గా భా­విం­చే రో­జు­లు వచ్చా­యి. ప్ర­త్యు­త్ప­త్తి రేటు 2.1గా ఉంటే జనా­భా పె­రు­గు­దల స్థి­రం­గా ఉం­టుం­ది. మన రా­ష్ట్రం­లో ప్ర­త్యు­త్ప­త్తి రేటు 1.8గా ఉంది.. ఇది మె­రు­గు­ప­డా­లి’’ అని సీఎం అన్నా­రు. గతం­లో ఇద్ద­రు పి­ల్లల కంటే.. ఎక్కువ మంది ఉంటే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో పోటీ చే­య­డా­ని­కి వీలు లే­ద­నే చట్టం తె­చ్చా­న­ని గు­ర్తు­చే­శా­రు.

Tags

Next Story