CBN: ప్రపంచం మొత్తం భారత్‌వైపే చూస్తోంది: చంద్రబాబు

విశాఖ అందమైన నగరమని.. దీనితో ఏ నగరాన్ని పోల్చలేమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో రెండో రోజు జరుగుతున్న సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘రెండు రోజుల సదస్సులో అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకువచ్చాయి. 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు రావడం హర్షణీయం. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఏపీలో విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి వినియోగాన్ని పెంచగలిగాం. ఏఐ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలి. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలకు కొదవలేదు. నైపుణ్యం ఉన్న యువతకు ఎలాంటి కొరత లేదు. ఒక విజన్‌తో ముందుకెళ్లడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోంది. భారత్‌లో సమర్థ నాయకత్వం ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. ఏపీ ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు.
రేమాండ్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన
విశాఖ వేదికగా జరుగుతోన్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లాలో రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు.. రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు రేమండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేశారు.. అనంతపురంలోని రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేయనుంది.
లులుతో ఏపీ ప్రభుత్వం ఎంవోయు
ఏపీలో లులు ఎంట్రీ ఖాయమైంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం లులు ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విశాఖ వేదికగా మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌పై ఎంవోయూ కురుద్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, లులు సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. అయితే, ఇటీవల జరిగిన కేబినెట్లో లులు పెడుతున్న షరతులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యంతరం తెలపడం గమనార్హం. భాగస్వామ్య సదస్సులో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

