ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం : కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం : కేంద్రం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానం ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతోపాటు అనేక మినహాయింపులు ఇచ్చామంటూ వివరించారు.

విభజన సమస్యల పరిష్కారంపై కూడా ఓ రకంగా కేంద్రం చేతులెత్తేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయని.. వాటి పరిష్కారం తమ చేతుల్లో లేదని నిత్యానందరాయ్ అన్నారు. ఆయా సమస్యల్ని ఏపీ- తెలంగాణ ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని MP రామ్మోహన్ నాయుడు తీవ్రంగా ఖండించారు.

ఏపీకి రైల్వే జోన్ విషయంలోను, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలోనూ, పోలవరం నిధుల విషయంలోను, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ఇలా ప్రతి సందర్భంలోనూ ఆంధ్రుల హక్కుల్ని దెబ్బతీస్తూ, సెంటిమెంట్‌ను పట్టించుకోకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తుండడంపై TDP ఎంపీలు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలను కేంద్ర ప‌్రభుత్వం అమలు చేయాలని ఎంపీ రామ్మెహన్‌నాయుడు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప‌్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని పార్టీలు అంగీకరించాయని గుర్తుచేసారు రామ్మోహన్‌నాయుడు.

అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం.. హోదా సహా విభజన హామీలు అమలు చేయకుండా ఏపీని అన్యాయం చేయడం సరికాదన్నారు. అధికారంలోకి వస్తే హోదాపై పోరాటం చేస్తామన్న YCP ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని TDP ఎంపీలు నిలదీస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీ హక్కుల విషయంలో YCP నేతలు రాజీపడుతున్నారని మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story