పసుపుమయంగా మారిన..కుప్పం

పసుపుమయంగా మారిన..కుప్పం
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. తాజాగా నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కాసేపట్లో కుప్పంకు బయల్దేరనున్నారు.చంద్రబాబు కుప్పం టూర్‌ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. కుప్పం మొత్తం పసుపుమయంగా మారిపోయింది.

మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు కుప్పంలోని బీసీఎన్‌ కల్యాణ మండపానికి చేరుకుంటారు. సాయంత్రం 7.30నిమిషాల వరకు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. ముందుగా నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం కుప్పం మున్సిపల్‌ పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చిస్తారు. తర్వాత ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ చేరుకుని రాత్రి బస చేస్తారు.

రేపు ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అక్కడి నుంచి బీసీఎన్‌ కల్యాణ మండపానికి చేరుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రామకుప్పం మండల పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో టీడీపీలోకి చేరికలుంటాయి. డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేశ్‌బాబు సహా, పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నారు. తర్వాత ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, లక్ష మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు ప్రచారం ప్రారంభిస్తారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన లోగోను ఆవిష్కరిస్తారు.ఎల్లుండి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుప్పం రూరల్‌, శాంతిపురం మండల పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అవుతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story