రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబును నిర్బందించిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్భందంలో తీసుకున్నారు పోలీసులు. చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే.. అక్కడి చేరుకున్న పోలీసులు ఆయనకు నోటీసీలిచ్చారు. ఆయన పర్యటన వల్ల తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని, కోవిడ్ రూల్స్‌ను పాటించడం లేదంటూ నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులు ఆయన్ను అదుపులో తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకల్ని నిరసిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ చిత్తూరు, తిరుపతిలో ధర్నాలు చేయనున్నారు. వైసీపీనేతల అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే.. ఈ ధర్నాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు. దీంతో పాటు టీడీపీ నేతల ఇళ్ల వద్ద నోటీసులు అంటించారు.
ఐదు వేల మందితో చేపట్టనున్న ధర్నాకు అనుమతించాలంటూ టీడీపీ నేతలు పెట్టుకున్న దరఖాస్తును నిరాకరించారు పోలీసులు. కొవిడ్ రూల్స్, ఎలక్షన్ కోడ్ దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని వెల్లడించారు. ధర్నాతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని నోటీసు జారీ చేశారు. వేలమందితో ర్యాలీలు, నిరసనలకు అనుమతి ఇవ్వలేమని నోటీసుల్లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com