Chandrababu: ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న చంద్రబాబు, లోకేష్.. షెడ్యూల్ ఫిక్స్..

Chandrababu: ఏపీలో ఎన్నికలకు ఇంక రెండేళ్ళు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి వరకు పార్టీపై సమీక్షలు జరిపిన చంద్రబాబు.. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. మే మొదటి వారం నుండి చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఉండనున్నాయి. మే మొదటి వారం నుండి మే నెలలో జరిగే మహానాడు వరకు ముందుగా బాదుడే బాదుడు పేరుతో నిరసనలు నిర్వహించబోతున్నారు. పార్టీ తరుఫున జరిగే నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.
పెరిగిన విద్యుత్ చార్జీలు, ఆర్టీసి చార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను పేరుతో ఇప్పటికే టీడీపీ నేతలు బాదుడే బాదుడు పేరుతో నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇక మే నెల మొదటి వారంలో వివిధ జిల్లాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనబొతున్నారు. మహనాడు తర్వాత నెలకు రెండు జిల్లాల చొప్పున పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక వారం రోజుల్లో ఖరారు కానుంది.
బస్సు యాత్రలు చేయాలా లేక రోడ్ షోనా లేక సభలు, సదస్సులు నిర్వహించాలా అనేదానిపై ఒక వారం రోజుల్లో క్లారిటి రానుంది. తన టూర్‌లకు సంబందించి మిడియాతో చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టూర్‌కు సిద్దమవుతున్నారు. లోకేష్ ఏడాది పాటు ప్రజల్లో ఉండే విధంగా యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రతి ఇంటిని టచ్ చేయాలని లోకేష్ భావిస్తున్నారు.
అందుకు పాదయాత్ర అయితేనే బెటర్ అనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతుంది. రానున్న రెండు మూడు నెలల్లో లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర ఏ విధంగా ఉండాలనేది పార్టీ ఒక ప్లాన్‌ను సిద్దం చేస్తోంది. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడ ప్రతి ఇంటికి వెళ్తూ వారి సమస్యలు తెలుసుకొవడంతో పాటు బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లోకేష్.
మంగళగిరిలో ఇంటింటికి వెళ్లడం పూర్తి అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు లోకేష్ రెడీ అంటున్నారు. 73 ఏటా అడుగుపెడుతున్న చంద్రబాబు.. ఎన్నికల వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చారు. ఇవాళ పుట్టిన రోజు సందర్భంగా నూజివిడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. నెకల్కం గొల్లగూడెంలో ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com